Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రెగ్నెన్సీ తర్వాత 20 కేజీలు తగ్గింది.. ఆమె సీక్రెట్‌ ఇదే!

Ghazal Alagh lost 20 kg after pregnancy and shares her secret
Advertisement
  • ప్రెగ్నెన్సీతో 30 కిలోల బరువు పెరిగిన ఘజల్‌ అలఘ్‌
  • డెలివరీ తర్వాత బరువు 84 కిలోలకు చేరినట్లు వెల్లడి
  • క్రమంగా 20 కిలోలు తగ్గి 63-64 కిలోలకు చేరిక
  • బరువు తగ్గడంలో 80 శాతం పాత్ర ఆహారానిదేనని వ్యాఖ్య
  • మిగిలిన 20 శాతం మాత్రమే వ్యాయామం అని స్పష్టం
Advertisement
గర్భధారణ సమయంలో బరువు పెరగడం సహజం. కానీ డెలివరీ తర్వాత అదే బరువును తగ్గించుకోవడం మాత్రం చాలా మంది మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది. మామాఎర్త్‌ సహ వ్యవస్థాపకురాలు ఘజల్‌ అలఘ్‌ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. రెండు గర్భధారణల్లో 30 కేజీల వరకు బరువు పెరిగిన ఆమె.. డెలివరీ తర్వాత ఏకంగా 20 కేజీలు తగ్గారు. అదెలా సాధ్యమైందో తాజాగా వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ క్రియేటర్‌ గుంజన్‌ తనేజాతో జరిగిన సంభాషణలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ షూటింగ్‌లో పాల్గొన్నానని, అప్పటికే తన సాధారణ బరువు కంటే 28 కిలోలు ఎక్కువగా ఉన్నానని చెప్పారు.

డెలివరీ తర్వాత మన బరువు నుంచి బిడ్డ వెయిట్‌ మాత్రమే తగ్గుతుందని ఘజల్‌ అలఘ్‌ వెల్లడించారు. మిగిలిన బరువు అలాగే ఉండిపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రసవం జరిగిన మూడు నెలల తర్వాత తన బరువు 83-84 కిలోలకు చేరినట్లు వెల్లడించారు.

ఆ తర్వాత క్రమంగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ముందుగా 70 కిలోలకు, చివరకు 63-64 కిలోలకు చేరుకున్నానని చెప్పారు. మొత్తంగా దాదాపు 20 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో తనకు ఆహారమే కీలక పాత్ర పోషించిందని ఘజల్‌ చెప్పారు. ‘‘బరువు తగ్గడంలో 80 శాతం పాత్ర మనం తినే ఆహారానిదే. మిగిలిన 20 శాతం మాత్రమే శారీరక కదలికలు, వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది’’ అని వివరించారు.

త్వరగా ఫలితాలు రావాలనే ఆలోచనతో కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడం, రోజూ చురుగ్గా ఉండడంపైనే తాను దృష్టి పెట్టానని తెలిపారు. ప్రసవానంతరం బరువు తగ్గాలనుకునే మహిళలు తొందరపడకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Advertisement
Advertisement
Ghazal Alagh
Mamaearth
Post pregnancy weight loss
Weight loss secrets
Shark Tank India
Health and fitness

More Telugu News